శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మార్వో తో పాటు పలువురు అధికారులు గైహాజరయ్యారు. మరోవైపు సర్పంచ్ లకు బదులుగా సర్పంచ్ ప్రతినిధులు హాజరయ్యారు. దీంతో ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. గత ఐదు నియోజకవర్గ పరిధిలో సాగునీరు అందక రైతులు పడిన ఇబ్బందులు ఇక ఉండవని, ఖరీఫ్ సీజన్ కు శివారు భూములకు సాగునీరు అందిస్తామని తెలిపారు.