ఆళ్లగడ్డలో సచివాలయ ఉద్యోగుల నిరసన,క్లస్టర్ వ్యవస్థను వెంటనే ఎత్తివేయాలని సచివాలయ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సంఘం నాయకుడు బాలస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో క్లస్టర్కు ఒక వాలంటీర్ ఉండేవారన్నారు. ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ రద్దు కావడంతో 3 క్లస్టర్ల బాధ్యత ఒక సచివాలయ సెక్రటరీ చూసుకోవాల్సి వస్తోందని అన్నారు.