గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఇష్టానుసార వ్యాఖ్యలు చేసి గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని టీడీపీ నాయకుడు కొల్లి కృష్ణమూర్తి విమర్శించారు.బుధవారం మాచవరంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 'కర్రలతో కాదు గొడ్డలితో వస్తారు' అన్న కాసు వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలు తరిమి కొట్టిన విషయాన్ని మర్చిపోయారేమోనని ఎద్దేవా చేశారు. కాసు మహేష్ రెడ్డి మాచవరం వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.