కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని పలువురు టీడీపీ నాయకులు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. తిరుపతి జిల్లాకు సమీపంలో కార్వేటినగరం ఉందన్నారు. ఈ జిల్లాలో కలిపితే తమకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. తమ విన్నపాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.