బలహీనవర్గాల జనాభాను ప్రాతిపదికను తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అంశంపై గవర్నర్ ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన స్వగృహం ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తో పాటు పలు అంశాలపై మాట్లాడారు.