గత వైసిపి హయాంలో తీసుకువచ్చిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం కావటం దుర్మార్గమని మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని తాడేపల్లిలో గల వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు వైద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీని విస్మరిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.