ఆర్మూర్ పట్టణంలోని జెండా గల్లి కంటేశ్వర్ యూత్ సభ్యులపై గణనాథుని ఊరేగింపులో ఆర్మూర్ పోలీసులు ఆదివారం ఉదయం సుమారు 6 10 దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టడంతో యూత్ సభ్యులు కాలనీవాసులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆర్మూర్ సిఐ యూత్ సభ్యులను స్వల్ప లాటి ఛార్జ్ చేసి చదరగొట్టారు. దీంతో యూత్ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.