వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని 220 పడకల ఆసుపత్రిగా సామర్థ్యాన్ని పెంచుతూ నిర్మించబడుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగ అధికారులకు సూచించారు.