ఆసిఫాబాద్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ASF సీఐ బాలాజీ వరప్రసాద్ అన్నారు. గణేష్ మండపాల నిర్వాకులు చందాల పేరుతో వేధింపులకు గురి చేయొద్దన్నారు. లక్కీ డ్రా స్కీముల పేరుతో వసులు చేయొద్దని సూచించారు. లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. శ్రీ సంఘ సేవ గణేష్ మండలి సేవ నిర్వాకులపై కేసు నమోదు చేశామన్నారు. లక్కీ డ్రా స్కీముల పేరుతో ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.