ప్రజారోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు. ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.దేవనకొండకు చెందిన మాల వెంకటేశ్వర్లు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్య ఖర్చులు భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం కోసం ఎంపీ బస్తిపాటి నాగరాజుని సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎంపీ దరఖాస్తును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో సీఎం నిధి నుంచి రూ. 1,23,919 మంజూరయ్యాయి. ఈ మేరకు ఎంపీ నాగరాజు తన కార్యాలయంలో లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు. ఈ