రాయదుర్గం కొండదిగి సీతాఫలాలు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. సి విటమిన్ అధికంగా ఉండే ఎంతో మధురమైన సీతాఫలాలు రాయదుర్గం పట్టణంలోని కొండ ప్రాంతం, పైతోట, మల్లాపురం, మెచ్చిరి, గుమ్మగట్ట మండలంలోని శిరిగేదొడ్డి, గొల్లపల్లి తదితర ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో సీతాఫలాలు విరివిగా లభిస్తాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 200 కుటుంబాలు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కొండకు వెళ్లి సీతాఫలాలు గంపల్లో తీసుకువచ్చి పట్టణంలోని మార్కెట్ లో విక్రయిస్తారు. సీమ యాపిల్ గా పిలువబడే వీటికి ఈ సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈ ఏడాది ముందస్తు వర్షాలు రావడంతో పూత రాలిపోయి పంట దిగుబడి తక్కువగా వచ్చిందన్నారు.