శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో సంచలనంగా మారిన హత్య కేసును పోలీసులు 24 గంటలు లోపే చేదించారు. పుట్టపర్తిలో ఎస్పీ రత్న కేసు వివరాలను వెల్లడించారు. లోకేంద్ర అనే వ్యక్తి ఏడాది క్రితం ఆటో బాడుగ విషయంలో ఘర్షణ పడి శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తిని హత్య చేశాడు. అప్పటినుంచి లోకేంద్ర పై పగతో రగిలిపోతున్న శ్రీనివాస రెడ్డి కుమారుడు బాలకృష్ణారెడ్డి లోకేంద్రను హత్య చేయాలని సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. ఈ నెల నాలుగవ తేదీన శ్రీనిధి మార్ట్ సమీపంలో ద్విచక్ర వాహనంలో ఉండగా వెనుక వైపు నుంచి కారుతో వచ్చి లోకేంద్ర ద్విచక్ర వాహనాన్ని బాలకృష్ణారెడ్డి ఢీకొన్నాడు.