విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషనులో 2018 సం.లో నమోదైన గంజాయి కేసులో నిందితునికి 12సం.లు జైలు శిక్ష మరియు రూ.1లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం 1వ ఎ.డి.జె.జడ్జి ఎం.మీనాదేవి బుధవారం 3pm తీర్పు వెల్లడించారని జిల్లా SPవకుల్ జిందల్ తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో తే. 19-02-2018 దిన వాహన తనిఖీలు చేపడుతుండగా పోలీసు సిబ్బంది WB 44 AA 0198 నంబరుగల బొలెరో వ్యాన్ తనిఖీ చేయగా పశ్చిమ బెంగాల్ కు చెందిన సంతు ముజిందార్ (36 సం.లు), ఎ.ఎస్.ఆర్. జిల్లా జి.కే.వీధి మండలం దుప్ప