గుత్తి పోలీస్ స్టేషన్లో బుధవారం వినాయక పండుగను పురస్కరించుకొని పోలీసులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సై సురేష్, ఏఎస్ఐ నాగ మాణిక్యం ఆధ్వర్యంలో పోలీసులు సాయంత్రం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. గుత్తి శివారులోని తురక పల్లి రోడ్డులోని కుంటలో ఘనంగా నిమజ్జనం చేశారు. జై గణపతి అంటూ నినాదాలు చేశారు.