కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై దాడి చేసిన నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ పరామర్శకు వస్తే.. అది ఓర్వలేక ప్రసన్న కుమార్ రెడ్డి పై అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి దాడుల సంస్కృతి సరికాదని వ్యాఖ్యానించారు. ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు