తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి మార్గదర్శకమని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాలు మర్చిపోలే నివన్నారు.