తిరుపతి రూరల్ వేదాంతపురం గ్రామపంచాయతీలోని శ్రీ వెంకటేశ్వర ధోబిఘాట్ను కొంతమంది భూకబ్జాదారులు రాత్రికి రాత్రి అక్రమ కట్టడాలు నిర్మించి కబ్జా చేస్తున్నారని రజకుల స్థలాన్ని రజకులకే కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు బుధవారం వేదాంతపురం గ్రామపంచాయతీలో ఉన్న దోబీ ఘాట్ స్థలాన్ని సిపిఐ బృందం పరిశీలించింది ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రజకుల సంక్షేమం కోసం దోబీ ఘాటును కేటాయిస్తే ఆ దోబి ఘాటును కొంతమంది పలుకుబడి కలిగిన భూ కబ్జాదారులు కబ్జా చేయాలని చూడడం అత్యంత దారుణం అన్నారు.