సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ముందు మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య చేసుకుంటానని గురువారం సాయంత్రం హాల్చల్ చేసింది. ర్యాకల్ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ మద్యం సేవించి చనిపోతానని బస్సు ముందు గొడవ చేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఆమెను గ్రామానికి తరలించారు.