విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహనా సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విష్ణుప్రియ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించాలని, ఐరన్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకమరాజు, ఆరోగ్య పర్యవేక్షకులు చంద్రమోహన్, పబ్లిక్ హెల్త్ నర్స్ భారతి, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.