అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మార్కెట్ యార్డు చైర్మన్‌గా ఎస్ఎండి షపీనాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 11న రాయచోటి మార్కెట్ యార్డులో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లక్కిరెడ్డిపల్లెలో బాధ్యతలు చేపట్టిన షపీనాయక్‌ను స్థానిక నాయకులు సన్మానించారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.