విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే లో కడుతున్న బ్రిడ్జ్ ఎత్తు పెంచాలని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం చింతల జూటూరు గ్రామానికి చెందిన రైతులు బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టారు. బ్రిడ్జి హైట్ తగ్గించడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. పంట పొలాల్లోకి ధాన్యం , ఎరువులు రైతు సామాగ్రి ఏదైనా తీసుకెళ్లాలి అంటే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. బ్రిడ్జి హైట్ ని పెంచి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.