కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం జరగనున్న సామూహిక వరలక్ష్మి వ్రతాల పాసుల కోసం మహిళల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగింది. తరలివచ్చిన మహిళలను నియంత్రించలేక పోలీసులు ఇబ్బందులు పడ్డారు. తొక్కిసలాటలో కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీఐపీలకే పాసులా, సామాన్య మహిళలకు లేదా అంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు.