ఈరోజు నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలోని తూప్రాన్ పట్టణంలో అంగడిలో అంగన్వాడి మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రీస్కూల్ మెటీరియల్ నీ సిద్ధం చేసి ఇట్టి మెటీరియల్ ఉపయోగించి అంగన్వాడీ టీచర్ 3-6y పిల్లలకూ పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమాలు ఎలా నేర్పిస్తుంది అనేది తెలియజేయడం జరిగింది. గర్భిణీ బాలింత తల్లులకు అందించే సేవల గురించి కూడా తెలియజేయడం జరిగింది.అలాగే అంగన్వాడీ ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శివకుమారి,మెహత మరియు తూప్రాన్ పట్టణం లోని అంగన్వాడీ టీచర్లు అందరూ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.