తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేశారు. 'ఓటు దొంగ దిగిపో' అంటూ నినాదాలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ పాలకులు అధికార బలంతో కీలుబొమ్మగా మార్చుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, రామకృష్ణరావు, తదితరులు పాల్గొన్నారు.