కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి భూపేష్ సుబ్బరామిరెడ్డి మంగళవారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనంతపురంలో రేపు బుధవారం జరగబోయే సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోత్సవ సభ సదుపాయాల గురించి ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, అనంతపురం జిల్లా అధికారులతో ఆయన చర్చించారు. ఆయన వెంట టిడిపి నాయకులు పాల్గొన్నారు.