.2000 సం: ఆగస్టు 28న హైదరాబాద్ బషీరాబాద్ లో జరిగిన విద్యుత్ వ్యతిరేక ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం పోలీస్ కాల్పుల ధమనకాండకు పూనుకుంది. ఈ కాల్పుల్లో విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ బాలస్వామి అను ముగ్గురు కార్యకర్తలు అశువులు బాశారు. ఈ మారణకాండ జరిగి నేటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అమరవీరుల సంస్మరణ.. ప్రతిజ్ఞ దినం పాటించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. జిల్లా వామపక్ష పార్టీలు నేడు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించాయి.విద్యుత్తుఅమరవీరులకు పూలతోఘనంగా శ్రద్ధాంజలి ఘటించడమైనది.