షాద్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల 20 లక్షల నిధులు నాలుగు పార్కుల అభివృద్ధి కోసం నాలుగు కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పూర్తిస్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.