విద్యార్థులందరూ బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అనంతపురం జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠాలను ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని అడిగారు. తాగునీటి సదుపాయం, టాయిలెట్లు, బాత్రూములు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాలపైన ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా కష్టపడి చదవాలన్నారు.