పామర్రు, కంకిపాడు, జజ్జవరం, కురుమద్దాలి, ఉప్పులూరు గ్రామాల్లోని రైతులతో ముఖా ముఖీ మాట్లాడిన జిల్లా కలెక్టర్ డికె బాలాజీ యూరియా సరఫరాపై ఉన్న అపోహలను తొలగించడానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. స్తానిక పామర్రు, కంకిపాడు మండలాల్లోని జజ్జవరం, కురుమద్దాలి, ఉప్పులూరు గ్రామాల్లోని రైతులతో ఆయన ముఖా ముఖీ మాట్లాడారు. రైతులకు సమృద్ధిగా యూరియా నుసరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఎకరా వరి పంటకు ఉపయోగించాల్సిన యూరియా మోతాదును కూడా రైతులకు వివరించారు.