జిల్లాలో ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత టీచర్లదేనని జిల్లా కలెక్టర్ ఆనందద్ సూచించారు. గవర్నమెంట్ పాఠశాలల్లో 50 శాతం మంది విద్యార్థులు ఉంటే, ప్రైవేట్ పాఠశాలలలో కూడా 50 శాతం మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి విద్యారంగ అభివృద్ధికి దోహదపడాలని వివరించారు. రానున్న ఐదు పది సంవత్సరాల కాలంలో విద్య వ్యవస్థలో వచ్చే మార్పులు దృష్టిలో ఉంచుకొని టీచర్లు తదనుగుణంగా శిక్షణ పొందాలన్నారు.