యువత పెడదోవ పడుతున్న నేటి తరుణంలో స్వామి వివేకానందుని స్ఫూర్తితో ముందుకు వెళతామని రావడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని గుమడాంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో మంత్రి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ తో కలిసి వివేకానందుని విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం యువతలో స్ఫూర్తిని నింపుతున్న ప్రముఖ ఉపాధ్యాయులు డాక్టర్ రంభ రజినీకాంత్, కె.వి సత్యనారాయణ, కొల్లి గిరిబాబు లతోపాటు గవర తిరుపతి నాయుడు, దుంప రామచంద్రారెడ్డి, శిల్పి రాము ను ఘనంగా సత్కరించారు.