వికలాంగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని, పెంచిన ఫించన్ ను పర్సెంటేజ్ తగ్గించి ఫించన్లు తొలగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం 12 గంటలు విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 4 లక్షల 30 వేల పెన్షన్లు రద్దు చేశారని,వికలాంగుల సర్టిఫికెట్లలో పర్సెంటేజ్ తగ్గించాలని వైద్యులకు ప్రభుత్వం టార్గెట్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం వికలాంగ సర్టిఫికెట్లు పొందిన వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు.