దాదాపు 40 ఏళ్ళ క్రితం ఉన్నప్పటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటూ, క్రమశిక్షణ, అంకితభావంతో నాలుగు దశాబ్దాలపాటు నిర్విరామంగా సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని కడప జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఆగస్టు నెలాఖరున పదవీ విరమణ పొందిన సిబ్బందిని ఆదివారం కడప లోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పి మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలో ప్రత్యేక స్థానంలో ఉండడానికి మీలాంటి సిబ్బంది సేవలు కీలకమన్నారు.