కార్వేటినగరం మండలంలోని ఆర్‌కేవీబీ పేట గ్రామంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ అధికారి హేమలత ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. డాట్ సెంటర్ చిత్తూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ. రామకృష్ణారావు రైతులకు రసాయనిక ఎరువులు తగ్గించి జీవన ఎరువులు వాడకం, నానో యూరియా ప్రయోజనాలు, పచ్చ రొట్టె ఎరువుల వాడకం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు చురుకుగా పాల్గొన్నారు.