ఏలూరు జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రమైన భీమడోలులోని పంచాయతీ రోడ్డు, సినిమా హాలురోడ్డు, అరుంధతి,ఇందిరాకాలనీల రోడ్లు, భీమడోలు జంక్షన్ లోని ఏలూరు, ద్వారకాతిరుమల రోడ్లు నీటమునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ అధికారులు నీటిని డ్రైన్లలోకి మరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం 8.30గంటలకు 79.9మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు ఐయిందని అధికారులు వెల్లడించారు.