విశాఖపట్నం నగరంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న “సేనతో సేనాని” మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు. అరవ శ్రీధర్ మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు, కార్యకర్తలు రానున్నారు. విశాఖ ప్రజల సహకారంతో ఈ సభను ఘనవిజయవంతం చేస్తాం. మా నాయకుడి కోసం ప్రతి ఒక్కరం కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం, అని పేర్కొన్నారు.