ధర్థి అభ జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ లబ్ధిని చివరి ఆదివాసి వరకు చేరేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులకు సూచించారు. నేడు సోమవారం రోజున సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆది కర్మ యోగ అభియాన్ కార్యక్రమం పై జిల్లా అధికారులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వికాసత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని గిరిజనులందరినీ అభివృద్ధి చేయాలని సంకల్పించిదనీ, అందులో భాగంగా ఆది కర్మ యోగి కార్యక్రమాల ద్వారా 7 డిపార్ట్మెంట్ల నుండి రాష్ట్ర స్థాయి శిక్షణ పంపించడం జరిగిందని, జిల్లా మాస్టర్ ట్రైనర్స్ తో జిల్లా ఉన్నత