Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 31, 2025
వి.ఆర్.పురం మండలంలో వరద బాధితులు ఆదివారం సాయంత్రం వినూత్న నిరసన చేపట్టారు. మండలంలోని శ్రీ రామగిరి, చొక్కనపల్లి గ్రామస్థులు వరద నీటిలో నిలబడి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువులు అందజేయాలని నినాదాలు చేశారు. 10రోజులుగా తమ గ్రామాలు వరదలో ఉన్నా పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ బాధలను చూడాలని కోరారు.