నారాయణపేట జిల్లా కోస్గి మద్దూర్ మండల కేంద్రాల లోని గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయక విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే రూట్ మార్గం ను నారాయణపేట ఎస్పి యోగేష్ గౌతమ్ సోమవారం 11 గంటల సమయంలో పరిశీలించారు. ముందుగా కోస్గి లోని మున్నూరు వాడ, బహార్ పేట లోని వినాయక విగ్రహాలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మద్దూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ బాల గణేష్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఘన విగ్రహాన్ని ఎస్పీ దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.