నంద్యాల శక్తి టీం సభ్యులు ప్రసాద్, రఫీ, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ స్నేహలత ఆదివారం గోస్పాడులోని కస్తూర్బా బాలికల హాస్టల్లోని విద్యార్థినిలకు శక్తి యాప్, వన్ స్టాప్ సెంటర్, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.