ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు