కోనాపూర్ గ్రామంలో యూరియా కోసం రోడ్డు పై రాస్తారోకో నిర్వహించిన రైతులు మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో యూరియా కోసం జాతీయ రహదారి 765 డిజి రోడ్డుపై సోమవారం ఉదయం రైతులు గంటపాటు రాస్తారోకో చేపట్టారు. గత పది రోజులుగా తమకు యూరియా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్-సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలరాజు ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు.