యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పై బిఆర్ఎస్ నాయకులతో ఎయిమ్స్ అధికారులు చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్య అధికారులు బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.