జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఇసుక కోసం మానేరు వాగులోకి వెళ్ళగా వాగులో వరద ఉధృతి పెరగడంతో ఇసుక ట్రాక్టర్ వాగులో చిక్కుకుపోయింది దీంతో గమనించిన ఇతర ట్రాక్టర్ యజమానులు వాగులోకి కొంతవరకు చేరుకొని మరో ట్రాక్టర్ సహాయంతో ఇంజన్ డబ్బాను వదిలిపెట్టి కేవలం ఇంజన్ మాత్రమే బయటకు తీశారు అందులో చిక్కుకున్న ముగ్గురు యువకులను కాపాడారు మానేరు వాగు డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిందని తెలిపారు మానేరు డ్యాం గేట్లు ఎత్తుతున్నారని అధికారులు అప్రమత్తం చేసిన పట్టించుకోకుండా వాగులోకి వెళ్లి ఇబ్బందులు పడ్డారని స్థానికులు చర్చించుకుంటున్నారు.