సదాశివపేట మండలం అరూర్ గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు ఆవులు విద్యుదాఘాతంతో మరణించాయి. వైర్లు నేలకు తగులుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.