ఏడుపాయల్లో ఘనంగా అమ్మవారి పల్లకీ సేవ మెదక్,సెప్టెంబర్06(ప్రజా లక్ష్యం):ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి అమ్మవారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేసిన అనంతరం ఆలయ పూజారులు శంకర శర్మ పాత శర్మ మురళీ శర్మ ఆధ్వర్యంలోప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించి ఏడుపాయల పురమాద వీధుల్లో శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగింది. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, పల్లె సాయిబాబా,నరేష్, మహేష్,రాజు,యాదగిరి తదితర భక్తులు పాల్గొన్నారు.