సి.బెళగల్ మండలంలోని పోలకల్ గ్రామంలో ఉల్లి రైతులు పురుగుమందు తాగిన ఘటన వైసీపీ కుట్ర దారులు ఉన్నారని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. పండించిన పంటను కనీసం మార్కెట్ కి కూడా తీసుకెళ్లకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని ఖాలీ డబ్బాలో మద్యం కలుపుకొని పురుగుమందు తాగుతున్నట్లు వైసిపి కార్యకర్తల ద్వారా అసత్య ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని తెలిపారు. వైసిపి ఎన్ని కుట్రలు చేసినా కూటమి ప్రభుత్వం మరింత బలపడుతుందని తెలిపారు.