సత్తెనపల్లి పట్టణంలోని వెంగల్ రెడ్డి నగర్ 11వ వార్డు వద్ద ఆదివారం రాత్రి పట్టణానికి చెందిన అఖిల్ స్థానిక వినాయకుడు మండపం వద్ద ఇద్దరు యువకులు పై దాడి చేశాడు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాధితుల వివరాల మేరకు ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ సమయంలో దౌర్జన్యం చేస్తుంటాడని ఆరోపించారు. అడ్డొచ్చిన కోటేశ్వరమ్మ పై దాడి చేశాడు ఆమెకు చాతి నొప్పి రావడంతో ఆసుపత్రి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు.