Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలలో భాగంగా జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాల ఆధ్వర్యంలో మేజర్ ధ్యామ్చంద్ జన్మదిన పురస్కరించుకొని, జ్యోతిని వెలిగించి రన్ కార్యక్రమానికి ప్రారంభించారు. బస్టాండ్ నుండి కళాశాల, పాత అంగడి బజార్ మీదగా జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల వరకు రన్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. క్రీడాల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, రాబోయే రోజుల్లో మహాదేవపూర్ నుండి జాతీయస్థాయిలో క్రీడాలు ఆడి మండలానికి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.