Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
ఉదయగిరి మండలం, అప్ప సముద్రం గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో బాణాసంచా పేల్చి 9 మంది గాయాలకు కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని అప్పసముద్రం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధితులు ఉన్నారని, ఆరోగ్య రీత్యా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని.. పేదవారమైన తాము ఏమి చేయాలో పాలు పోవడం లేదని అన్నారు. జరిగిన సంఘటన మీద ఇంతవరకు కనీసం ఎవరు పరామర్శించలేదని అన్నారు. కేసులు నమోదు చేయొద్దని పోలీస్ శాఖ మీద తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ న్యాయం చేయాలని విన్నవించుకున్నార